ETV Bharat / city

Devineni: గిరిజనులు, ఆదివాసీలంటే అంత చులకనా ?: దేవినేని ఉమా - గిరిజనులు, ఆదివాసీలు అంటే ప్రభుత్వానికి అంత చులకనా ?

పోలవరం (Polavaram) ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి దేవినేని (Devineni) ఉమా మండిపడ్డారు. తాగడానికి కనీసం నీళ్లు కూడా లేక ప్రజలు ఇబ్బందులు..పడుతుంటే సీఎం, మంత్రులకు పట్టదా అని నిలదీశారు. పోలవరం స్టాప్‌వర్క్‌ ఆర్డర్ బ్యాన్ ఎత్తివేతపై (Polavaram Stop work Order Ban) ఈ ఏడాది జులై తర్వాత వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గిరిజనులు, ఆదివాసీలు అంటే ప్రభుత్వానికి అంత చులకనా ?

author img

By

Published : Sep 11, 2021, 3:56 PM IST

గిరిజనులు, ఆదివాసీలు అంటే ప్రభుత్వానికి అంత చులకనా ?

పోలవరం స్టాప్‌వర్క్‌ ఆర్డర్ బ్యాన్ (Polavaram Stop work Order Ban) ఎత్తివేతపై ఈ ఏడాది జులై తర్వాత వైకాపా (YCP) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) ప్రభుత్వాన్ని నిలదీశారు. తెదేపా (TDP) ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు బ్యాన్ ఎత్తివేతపై చర్యలు తీసుకుంటూ వచ్చి పనులు సజావుగా సాగేలా చూస్తే..,ఈ ఏడాది జులైతో ముగిసిన గడువుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. గోదావరికి (Godavari) 10 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తుండటంతో పోలవరం (Polavaram) ముంపు ప్రాంతాల్లో 70 గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం మొద్ద నిద్రపోతూ వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించటంలేదని ధ్వజమెత్తారు. గిరిజనులు, ఆదివాసీలు అంటే ప్రభుత్వానికి (AP government) ఎందుకంత చులకన అని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల గుండెల్లో గునపాలు దింపి, వారిని గోదావరిలో ముంచేశారని దుయ్యబట్టారు.

పోలవరం ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాగడానికి కనీసం నీళ్లు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 70 గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మొద్ద నిద్రపోతూ వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించటంలేదు. గిరిజనులు, ఆదివాసీలు అంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన. పోలవరం స్టాప్‌వర్క్‌ ఆర్డర్ బ్యాన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి.- దేవినేని ఉమా మాజీ మంత్రి.

వైకాపా కార్యకర్తలా డీజీపీ..!

విజయవాడలో జరిగిన మాజీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ (Ex- Kapu Corporation chairman) చలమలశెట్టి రామానుజయ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో దేవినేని, కొల్లు రవీంద్ర, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు (Law And Order) పూర్తిగా క్షీణించాయని కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ప్రభుత్వంపై మండిపడ్డారు. మహిళలు, సామాన్యులపై దాడులు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని ఆక్షేపించారు. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న దిశ చట్టం కేవలం కాగితాలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP Sawang) వైకాపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు జగన్మోహన్ రెడ్డికి (CM Jagan) తొత్తులుగా వ్యవహరిస్తే.. ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

ఇదీ చదవండి

రాయలసీమ సాగు ప్రాజక్టులకు జరిగన అన్యాయంపై నేడు చర్చించున్న తెదేపా నేతలు

CM Jagan: వారంలో బాషా సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.