ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లో ప్రభుత్వం పంచభూతాలతో ఆటలాడుతూ..మానవత్వం లేకుండా వ్యవహరించటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీమంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. నీటి నిర్వహణలో జలవనరుల శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా రాజధానిని ముంచాలనే కుట్రతో చేసిన దుర్మార్గానికి కృష్ణా-గుంటూరు జిల్లాల రైతులు బలయ్యారని ఆక్షేపించారు. వాతవరణశాఖ అధికారులు ఈ నెల7వ తేదీనే పెద్దఎత్తున వర్షపాతం నమోదుకానుందని హెచ్చరించిందన్నారు. సమగ్ర సమాచారం ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దేవినేని మండిపడ్డారు.
ముందు జాగ్రత్త చర్యలుగా కనీసం వరద నిర్వహణ సెల్లను కూడా ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. వరద నీటి విడుదలపై ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మూర్ఖత్వం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల రైతులు నష్టపోతే కనీసం పలకరించే దిక్కు కూడా లేదని వాపోయారు. సకాలంలో నష్టం అంచనా వేయకుండా తీవ్రత తగ్గాక వచ్చి నష్టాన్ని తక్కువ చేసి చూపేప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఇదీచదవండి