రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుండడం అత్యంత దురదృష్టకరమని... ఈ సామాజిక దురాచారానికి ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఈ సదస్సును ప్రారంభించగా... ప్రత్యేక ఆహ్వానితులుగా హోంమంత్రి సుచరిత హాజరయ్యారు. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా 1988లో చట్టం చేసినా నేకీ ఒక్క కేసు నమోదు కాకపోవడం... బాధితుల్లో అవగాహన రాహిత్యానికి నిదర్శనమని జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి ఒత్తిళ్లకు బెదరకుండా దేవదాసీలు నేరుగా న్యాయసేవను ఉచితంగా పొందవచ్చని చెప్పారు.
ఇవీ చూడండి