విజయవాడ నగరంలో ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న ఆక్రమణలను క్రమబద్దీకరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు. కలెక్టరు క్యాంపు కార్యాలయంలో కలెక్టరు ఇంతియాజ్‌తోపాటు రెవెన్యూ, నీటిపారుదల, రహదారులు, భవనాలు, నగరపాలక సంస్థ అధికారులతో నగరంలోని ఆక్రమణలను క్రమబద్దీకరించే అంశంపై మంత్రి సమీక్షించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కరకట్ట, బుడమేరు, ఏలూరు కాల్వ, ఇందిరానగర్, కాకానినగర్, వెంకటేశ్వర నగర్, గాంధీజీనగర్, గుణదల, మెుగల్రాజపురం, పటమట, చుట్టిగుంట ప్రాంతాల్లో ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
విజయవాడ నగరంలో ఆక్రమణలో 15,419 కుటుంబాలు నివసిస్తున్నాయని... ఇందులో 12,500 కుటుంబాలకు గృహాలను మంజూరు చేసి వేరేచోట ఇచ్చామని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోని క్రమబద్దీకరణ చేయవద్దంటూ... సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలున్నాయని అన్నారు. కోర్టు పరిధిలో లేని పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టరు అన్నారు. పెండింగ్ అంశాలకు సంబంధించి ఇప్పటికే ఆర్కియాలజి, రైల్వే శాఖలతో చర్చించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: