ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతూ విజయవాడ ఆర్టీసీ భవన్ వద్ద పలువురు ఆందోళన చేశారు. గత ప్రభుత్వ కాలంలో అధికారులు.. కారుణ్య నియమాకాలు చేపట్టడానికి ఆమోదం తెలిపి, తమ నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నారని అభ్యర్థిని ముంతాజ్ తెలిపారు. ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం తమ గోడు అసలు పట్టించుకోవడంలేదని వాపోయారు. జనవరి నుంచి ఉద్యోగాల కోసం కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నామన్నారు.
కారుణ్య నియామకం
ప్రభుత్వ ఉద్యోగం చేస్తోన్న వ్యక్తి హఠాన్మణం చెందితే.. ఆ వ్యక్తి కుటుంబంలోని అర్హులకు ఉద్యోగం కల్పిస్తారు. అనారోగ్య కారణాలతో సదరు ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో కుటుంబీకులకు ఉద్యోగం ఇస్తారు.
ఇదీ చదవండి: