ETV Bharat / city

గర్భవతి భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష - విజయవాడలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త వార్తలు

గర్భవతిగా ఉన్న భార్యను చంపిన భర్త.. ఇప్పుడు అతడికి ఉరిశిక్ష

author img

By

Published : Apr 8, 2021, 2:50 PM IST

Updated : Apr 8, 2021, 4:44 PM IST

14:49 April 08

2019 నాటి కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు తీర్పు

భార్య గర్భవతి అని జాలి లేకుండా సజీవదహనం చేసిన నిందితునికి మహిళా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. శైలజ, నంబియార్​కు 2018 లో వీరికి వివాహమైంది. విజయవాడ కృష్ణలంక పరిధిలో దంపతులు నివసించేవారు. నంబియార్ ఓ ప్రైవేట్ కాలేజీలో టీచర్​గా పని చేస్తున్నానని పెళ్లికి ముందు శైలజకు చెప్పాడు. పెళ్లి అనంతరం ఉద్యోగాన్ని మానేశాడు. శైలజ తండ్రి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి నుంచి నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు నంబియార్​. పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు.

డబ్బులు ఇవ్వకపోవటంతో 2019లో.. ఓ రోజు పథకం ప్రకారం నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో శైలజ మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు నంబియార్​కు నేడు ఉరిశిక్ష వేస్తూ తీర్పు వచ్చింది.

ఇదీ చదవండి: లంకెబిందెల్లో 5 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా..?

Last Updated : Apr 8, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.