ETV Bharat / city

Bapu Museum: బాపు మ్యూజియంలో చేనేత హస్తకళా ప్రదర్శన - విజయవాడ బాపు మ్యూజియం

గ్రామీణ ప్రజల చేతి వృత్తులను.. చేనేత వస్త్రాలు, కళాకృతులు ప్రతిబింబిస్తాయి. అంత‌రించిపోతున్న చేతి వృత్తుల‌ను ప్రోత్సహించటంతోపాటు క‌నుమ‌రుగ‌వుతున్న గ్రామీణ క‌ళ‌ల‌ను ప్రజలకు చేరువ చేసేందుకు చేనేత వస్త్ర ప్రదర్శనలు ఎంతగానో తోడ్పడతాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరిగి క్రాఫ్ట్‌ మేళాలు, చేనేత వస్త్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

బాపు మ్యూజియంలో  చేనేత హస్తకళా ప్రదర్శన
బాపు మ్యూజియంలో చేనేత హస్తకళా ప్రదర్శన
author img

By

Published : Feb 21, 2022, 1:44 PM IST

బాపు మ్యూజియంలో చేనేత హస్తకళా ప్రదర్శన

తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చేనేత వస్త్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని బాపు మ్యూజియంలో ఈ నెల మెుదటి వారంలో ప్రారంభమైన చేనేత వస్త్రాల మేళా... వచ్చే నెల మెుదటివారం వరకు జరగనుంది.

కొవిడ్ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో చేనేత మేళాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వటంతో పెద్ద సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన కలంకారి, చేనేత ఉత్పత్తిదారులు పాల్గొంటున్నారు. మంగ‌ళ‌గిరి, పోచంప‌ల్లి, వెంక‌ట‌గిరి, పొందూరు ఖద్దరు, కాశ్మీరీ సిల్క్‌, కోసా సిల్క్ చీర‌లు అందుబాటులో ఉంచారు. కొండ‌ప‌ల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, జూట్ బ్యాగ్‌లు, రకరకాల గాజులు, అలంకరణ వస్తువులు ఆకట్టుకుంటున్నాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రాచీన హస్తకళలపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా దేశంలో ఎక్కడ క్రాప్ట్ మేళాలు నిర్వహించినా అక్కడి వెళ్లి... ఉత్పత్తులను విక్రయించుకుంటారు. స్వయంగా చేత్తో చేయడం ద్వారా ఉత్పత్తుల్లో నాణ్యత ఎక్కువ ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్ ధ‌ర‌ల‌తో పోల్చితే మెరుగైన రాయితీ కూడా అందిస్తున్నట్లు తెలిపారు.

చేనేత, హస్త కళలను ప్రోత్సహించేందుకు మేళాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని నిర్వాహకులు అంటున్నారు. తమ ఉత్పత్తులు ఆశించిన స్థాయిలో ఉన్నా... తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుకున్న స్థాయిలో చేనేత పరిశ్రమకు రాయితీలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతివృత్తులు, హస్తకళల మనుగడకు ప్రభుత్వం కృషి చేయాలని చేనేత వ్యాపారులు అంటున్నారు. ప్రజలు కూడా చేనేత వస్తువులను వినియోగించి ప్రోత్సహించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Boat Journey: నాగార్జున కొండకు తిరిగి లాంచీ సర్వీసులు.. క్యూ కడుతున్న పర్యటకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.