విభజన హామీల అమలుపై కేంద్రం మాట తప్పిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఏపీపై మోదీ సర్కారు పగబట్టినట్లు కనిపిస్తోందన్నారు. హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను కేంద్రం పదేపదే మోసం చేస్తోందంటూ.. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా.. రేపు బంద్ పాటించనున్నట్లు మధు తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భాజపా మినహా అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొంటున్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ మోదీ సర్కారు రాష్ట్రానికి మొండిచేయి చూపిందన్నారు. ఉక్కు పరిశ్రమలో వాటాలు అమ్మేసి ఏమి చేస్తారో చెప్పడం లేదని ఆగ్రహించారు. ఇసుక విషయంలోనూ ప్రభుత్వం పునరాలోచన చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: