15వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో ఆంధ్రప్రదేశ్‌కు కోత విధించడం అన్యాయమని సీపీఎం నేత బాబూరావు అన్నారు. నవంబరు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విజయవాడలో సత్యనారాయణపురంలో 4వ రోజు ప్రజా చైతన్యభేరి పాదయాత్ర నిర్వహించామన్నారు. పట్టణ వాసులపై పన్నుల భారం మోపేందుకు... కేంద్ర ప్రభుత్వం పెడుతున్న షరతులకు వైకాపా ప్రభుత్వం లొంగిపోతుందని మండిపడ్డారు.
రాష్ట్రాలను దెబ్బతీసి అధికారాలను కేంద్రీకృతం చేసుకుంటున్న మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేస్తుందన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాజధాని, పోలవరం ప్రాజెక్టు అన్ని అంశాలలో రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెంచి సాధారణ, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని బాబూరావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి