విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 22 స్థానాల్లో సీపీఎం స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు తెలిపారు. గత రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పరిపాలనలో వైకాపా ప్రభుత్వం నగరపాలక సంస్థల్లో పాలన సాగించిందన్నారు. త్వరలో విజయవాడలో నీటి మీటర్లు బిగించే కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ప్రజలు ఓటు ద్వారా వైకాపాకు బుద్ది చెప్పాలని కోరారు.
ఇదీ చదవండి: 'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి'