దివాళా తీసిన కంపెనీకి ఇసుక రీచ్‌లను కట్టబెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై విపరీతమైన ధరల భారాలను మోపారని రామకృష్ణ మండిపడ్డారు.
ఎన్నికల్లో అధికార పార్టీ అవినీతికి పాల్పడుతూ... ప్రతిపక్షాలను గెలవకుండా చేస్తున్నారని ఆక్షేపించారు. సొంత మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని రామకృష్ణ అన్నారు. మార్చి 26న తలపెట్టిన భారత్ బంద్‌లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఇసుక విధానంపై ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు.
ఇదీ చదవండి: