గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా విక్రయాన్ని ఖండిస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వాటాను అదానీ కంపెనీకి విక్రయించటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం సన్నద్ధమైందని..ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో జతకట్టి ప్రైవేటు పాట పాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి
Covid: విద్యార్థులపై కొవిడ్ పంజా.. నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయా ?