అమరావతి ప్రాంత రైతులకు కౌలు చెల్లించాలని, 5 నెలలుగా పెండింగ్ పెట్టిన రైతుల పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి ధ్వంసానికి పాల్పడుతూ రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
రైతులకు సకాలంలో కౌలు చెల్లించటం లేదన్నారు. రైతులకు ప్రతి ఏటా మే నెలలో కౌలు చెల్లించాల్సి ఉండగా..,ఈ ఏడాది ఇప్పటివరకు కౌలు చెల్లించక పోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి భూములిచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని, ఫించన్లు ఇచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి