CPI Ramakrishna comments on PRC: ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన పీఆర్సీ.. అటు నిరుద్యోగులను, ఇటు ఉద్యోగులను నిరాశపరిచిందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసే లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయన్నారు.
జాబ్‌లెస్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు
వైకాపా అధికారంలోకి వచ్చాకా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. సీఎం జగన్ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత.. జాబ్‌లెస్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఉద్యోగులు అడిగిన దానికంటే చాలా తక్కువగా ఫిట్మెంట్ 23శాతంగా సీఎం ప్రకటించారన్ అన్నారు. గతంలో ఎన్నడూ ఇంటీరియమ్ రిలీఫ్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇది ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరడమేనని మండిపడ్డారు.
ఇదీ చదవండి:
Ashok Babu on PRC: పీఆర్సీతో ఉద్యోగులకు.. రూపాయి కూడా లాభం లేదు: అశోక్‌బాబు