ETV Bharat / city

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలి: సీపీఐ నేత రామకృష్ణ

కరోనాతో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విజయవాడలో సీపీఐ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

cpi leader ramakrishna conducted candle rally in vijayawada
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
author img

By

Published : May 12, 2021, 10:53 PM IST

రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా, వైద్య సౌకర్యాల కొరతతో భారీగా కరోనా మరణాలు పెరిగిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కరోనా బారిన పడి, ప్రభుత్వ వైఫల్యం వల్ల మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ... బుధవారం విజయవాడలోని చంద్ర బిల్డింగ్స్ ఆవరణలో సీపీఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆస్పత్రులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించి, కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం ప్రకటించాలని కోరారు.

ఇదీ చదవండి:

రుయా ఘటన: 'ప్రభుత్వ లెక్కలు తప్పు.. ఇవిగో ఆధారాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.