గతేడాది మే 30న విజయవాడ తోటవారివీధిలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ కేసులో 57 మందిని బైండోవర్ చేస్తూ నగర పోలీసు కమిషనర్(comissioner) బి.శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు గ్రూపులలో ఒక గ్రూపు నాయకుడు తోట సందీప్... రెండో గ్రూపు నాయకుడు మణికంఠ అలియాస్ పండు వర్గాలు పరస్పరం కొట్లాటకు దిగారు. సందీప్, పండు ఇద్దరు రక్తపు గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. సందీప్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మణికంఠ విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొంది కోలుకున్నారు.
ఈ కేసుల్లో రెండు గ్రూపులకు చెందిన 57 మందిని ఈస్టు డీసీపీ హర్షవర్దన్‌రాజు పర్యవేక్షణలో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వీరంతా జైలు నుంచి బయటకొచ్చినా తమ నేరప్రవృత్తిని మార్చుకోకపోవడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున సీఆర్‌పీసీ 107 ప్రకారం 57 మందిని బైండోవర్ చేయాలని సీపీ ఆదేశించారు. ఒక గ్రూపులో 32 మంది, రెండో గ్రూపులో 25 మందిని బైండోవర్ చేశారు.
ఇదీ చదవండి: