విజయవాడ 46 వార్డులో టీకా ఉత్సవాన్ని కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. మేయర్ భాగ్యలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్ పలు ప్రాంతాల సచివాయాల్లో ప్రత్యేక కరోనా టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో కొంతమేర డోసులు తక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లోని టీకా కేంద్రాలను మార్చారు. బస్టాండ్లో 120 మంది టీకా తీసుకుంటే.. కృష్ణలంకలో 350 మంది వరకు వ్యాక్సినేషన్ వేయించుకున్నారని అధికారులు తెలిపారు. టీకాలపై అపోహలు చాలావరకు తొలగిపోయాయని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: