కరోనాతో వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పడకలు లేవని బోర్డులు పెడుతున్నా... ఆసుపత్రి ముందు అంబులెన్స్‌లు వరుస కడుతూనే ఉన్నాయి. పడక దొరుకుతుందనే ఆశతో ఆవరణలోనే చాలామంది పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది రోగులు ఆక్సిజన్ పెట్టుకుని అంబులెన్స్‌ల్లోనే నిరీక్షిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడ ప్రభుత్వాసుపత్రి కొవిడ్ వైద్య విభాగం ముందు పది వరకు అంబులెన్స్‌లు వరుస కట్టాయి.
ఇదీ చదవండి: