ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు, 65ఏళ్లు దాటినవారు, బీపీ, షుగర్, గుండెజబ్బులు ఉన్నవారు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారి వివరాలనూ ఈ సర్వేలో నమోదుచేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. అనుమానిత లక్షణాలుంటే నోడల్ అధికారికి సమాచారం ఇస్తారని, వాళ్లు పరిశీలించి గృహనిర్బంధం, క్వారంటైన్‌కు సిఫార్సుచేస్తారని వివరించారు. మూడోదశలో బుధవారం 3.48 లక్షల కుటుంబాలను సర్వేచేసి, 604 మంది అనుమానితుల వివరాలను వైద్యుల దృష్టికి తీసుకొచ్చారని కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి: ఒక్కరోజే 15 పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి