ETV Bharat / city

కరోనా కంట్రోల్: 4 ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళిక - AP Latest News

కేసులు శరవేగంగా పెరగుతుండటంతో ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుంచి తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిపడా ఆక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు అధికారుల చర్యలు తీసుకుంటున్నారు.

4 ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళిక

author img

By

Published : Apr 21, 2021, 7:44 PM IST

4 ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళిక

రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరాపై అధికారుల కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రానికి ఎంతవరకు ఆక్సిజన్ కావాలో సమీక్ష చేస్తున్నారు. పీక్ స్టేజ్‌లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 80 నుంచి 100 టన్నుల ఆక్సిజన్ కావాలన్న అధికారులు.. రాష్ట్రానికి 4 ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుంచి తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిపడా ఆక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు అధికారుల చర్యలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 53వేల 800 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. వీరిలో 35 వేల మందికిపైగా హోం ఐసోలేషన్​లో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 10 నుంచి 20 శాతం మందికి మాత్రమే 24 గంటలు ఆక్సిజన్ అవసరముంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కేసులకు 100 టన్నుల ఆక్సిజన్ సరిపోతుందని అంచనా వేస్తున్నారు. కేసులు శరవేగంగా పెరగుతుండటంతో ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.