ETV Bharat / city

Corona Cases in TS: తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. మరో వేవ్​ తప్పదా?! - రాష్ట్రంలో కరోనా కేసులు

corona in TS: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకు గురిచేస్తుండగా.. క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. అప్రమత్తంగా లేకపోతే మరో వేవ్‌ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు.. మరో వేవ్​ తప్పదా?!

author img

By

Published : Dec 3, 2021, 6:28 PM IST

రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు.. మరో వేవ్​ తప్పదా?!

corona cases in TS: కొవిడ్ మహమ్మారి రెండేళ్లుగా రూపు మార్చుకుంటూ ప్రజలను ఏమార్చి దాడి చేస్తోంది. కరోనా కోరల నుంచి బయట పడుతున్నామని సంబరపడే లోపే ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోమారు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు బయటపడక పోయినా విదేశాల నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్ అని తేలింది. బాధితురాలికి టిమ్స్‌లో మహిళకు చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు రావాల్సి ఉంది.

క్రమంగా పెరుగుతున్న కేసులు..
corona cases increase: తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్‌లో రాష్ట్రంలో రోజుకు సరాసరి 157 వరకు కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య రెండొందలకు చేరువవుతుండటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం జీహెచ్​ఎంసీ పరిధిలోనూ కరోనా కేసుల సంఖ్యలో మార్పు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.

జీహెచ్​ఎంసీలో కేసుల పెరుగుదల..
covid cases in GHMC: జీహెచ్​ఎంసీ పరిధిలో రోజుకు సుమారు 70 నుంచి 80 వరకు కరోనా కేసులు వస్తున్నాయి. రంగారెడ్డిలో 15 , మేడ్చల్ జిల్లాలో 20 వరకు కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్ అర్బన్‌లో నిత్యం 10 వరకు కేసులు వస్తున్నాయి. ములుగులో కరోనా కేసులు సున్నాకు చేరుకున్నాయనుకుంటున్న తరుణంలో.. రోజు ఒకటి రెండు కేసులు వస్తున్నాయి.

మాస్కు లేకపోతే వెయ్యి జరిమానా..
without mask fine: ఈ ఏడాది ఆరంభంలో సెకండ్‌ వేవ్‌తో జనం వణికిపోయారు. గత మూడు నెలలుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ జాగ్రత్తలు విస్మరిస్తున్నారు. 60 శాతం మంది మాస్కులు సరిగ్గా ధరించటం లేదని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారికి వెయ్యి జరిమానా విధించాలని వైద్యారోగ్య శాఖ పోలీస్‌ శాఖకు సూచించడం అప్రమత్తంగా ఉండాలనే సంకేతాలనిస్తోంది. కొవిడ్ టీకా సర్టిఫికెట్ లేని వారిని బహిరంగ ప్రదేశాలకు అనుమతించలేమన్న సంకేతాలు ఇస్తోంది.

నిబంధనలు పాటిస్తేనే సేఫ్
covid rules in TS: మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ... కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తే ఏ వేరియంట్ వచ్చినా ప్రాణాలకు ముప్పు ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ను భయాందోళనల నేపథ్యంలో టీకాలు తీసుకుంటే మరింత రక్షణ లభిస్తుందని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రమాదకరం..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.