రాష్ట్రంలో కరోనా కేసులు(Corona Cases) తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,00,001 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,646 కేసులు నమోదయ్యాయి. 50 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 12,319కి చేరింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. మహమ్మారి బారిన పశ్చిమ గోదావరి జిల్లాలో 7, గుంటూరు జిల్లాలో ఆరు గురు మృత్యువాతపడ్డారు. కొవిడ్ నుంచి నిన్న 7,772 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 63,068 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఇదీ చదవండి: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డు.. 10 లక్షల మందికిపైగా వ్యాక్సిన్లు