మంత్రులతో పీఆర్సీ సాధన సమితి జరిపిన చర్చల్లో.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించలేదని.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జేఏసీ సెక్రటరీ బాలకాశీ నిలదీశారు. ఇప్పటివరకు తమ సమస్యలకు ఏ విధమైన పరిష్కారమూ రాలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి.. ఇప్పుడు వాటిని విస్మరించారని దుయ్యబట్టారు.
పీఆర్సీ సాధన సమితి.. ప్రభుత్వంతో చీకటి, దగాకోరు ఒప్పందం చేసుకుందని విమర్శించారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను.. సీఎం, పీఆర్సీ సాధన సమితి నేతలు మోసం చేశారని దుయ్యబట్టారు. సమాన పనికి సమాన వేతనం అని చెప్పి.. ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. తమను న్యాయం చేయాలని రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు బాలకాశి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
కొవిడ్, ఆర్థిక పరిస్థితుల్లోనూ చేయగల్గినంత చేశాం : ముఖ్యమంత్రి జగన్