జగన్ పాలనలో ప్రజలకే కాదు... దేవుని విగ్రహాలకు రక్షణ లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలో అలసత్వం ప్రదర్శిస్తుండటంతో దుండగులు మరింత పేట్రేగిపోతున్నారన్నారు. ఒక్క ఘటనలోనూ దోషులను గుర్తించి శిక్షించలేదన్నారు.
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేయటం విచారకరమన్నారు. రామతీర్థం రాజకీయ రణక్షేత్రంగా మారటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉదాసీనతను వీడనాడి ఆలయాల్లో విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి