ETV Bharat / city

'ప్రధాని అప్పుడప్పుడైనా మాస్క్ ధరిస్తారు.. మన సీఎం ఎప్పుడూ ధరించరు'

author img

By

Published : Apr 20, 2021, 4:18 PM IST

అధికారంలోకి రావాలనే తపన తప్ప.. ప్రజారోగ్యం భాజపాకు, వైకాపాకు పట్టడం లేదని.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. కరోనా కట్టడి కోసం ముందుగా సూచనలు చేసిన వారిని అవహేళన చేశారన్నారు.

congress leader sailajanath comments on central govt and state govt

ప్రధానమంత్రి మోదీ అప్పుడప్పుడైనా మాస్కు ధరిస్తారు.. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ మాస్క్ ధరించరని శైలజానాథ్ విమర్శించారు. ఒక అశాస్త్రీయమైన, ప్రణాళిక లేని విధానాలతో కరోనా విజృంభణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణమయ్యాయన్నారు. రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం రాజ్యమేలుతుందని.. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వరకే కరోనా వస్తుందా? పదో తరగతి విద్యార్థులకు కరోనా రాదా? అని ప్రశ్నించారు.

ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం లేకనే ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ పెట్టుకునే స్థాయికి వెళ్లారన్నారు. మందుల కోసం బారులు తీరుతున్నారన్నారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రజలందరికీ ప్రభుత్వాలే బాధ్యత తీసుకుని వ్యాక్సిన్ వేయించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కరోనా బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్న ఫ్లాట్‌కు తాళం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.