ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలులో చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. ఏపీసీసీ ఉపాధ్యక్షులు గంగాధర్ అన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఎస్సీ కమిషన్ ఛైర్మన్ని ఇప్పటి వరకు నియమించలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కేవలం ఎస్సీ, ఎస్టీల మీదే కాక ఇతర కులాలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ఇది కేవలం కులాల సమస్యే కాకుండా రాజకీయ సమస్యగా తయారైందన్నారు. వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులపై ఈనెల 11న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. మిగతా రాజకీయ పక్షాలని కలుపుకొని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
ఇదీ చదవండి: