తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ - తెదేపా వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ
వార్డు వాలంటీర్లు వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ... తెదేపా వర్గీయులు నిలదీయడంతో... కృష్ణాజిల్లా మచిలీపట్నం పరాసుపేటలో ఘర్షణ జరిగింది. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినా ఇంటింటికీ తిరిగి ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారని తెదేపా వర్గీయులు ప్రశ్నించారు. ఈ విషయంపై వార్డు వాలంటీర్లు తెదేపా నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో... చింతలపూడి పోలీసుస్టేషన్లో ఇరువర్గాల వారు పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు.
తెదేపా వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ