ETV Bharat / city

మా పాఠశాల మాకే ఉంచండి.. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ విద్యార్థుల ఆందోళనలు - Aided school

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులతో చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ విద్యార్థుల ఆందోళనలు

author img

By

Published : Nov 12, 2021, 11:03 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ విద్యార్థుల ఆందోళనలు

ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణను కాకినాడలో విద్యార్థులు మరోసారి నినదించారు. ఐడియల్ కళాశాలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ను ముట్టడించేందుకు యత్నించారు. జోరు వానలోనూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా... తోపులాట జరిగింది. పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేశారంటూ.... కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేశారు. వేల మంది పేద విద్యార్థులు చదువుకునే... ఎయిడెడ్‌ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గుంటూరు జిల్లాలో...

నగరంలోనూ ఎస్​వీఆర్​ఎమ్​(S.V.R.M) కళాశాల విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నగరం- రేపల్లె ప్రధాన రహదారి పై ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలిస్తున్న పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు. ఎయిడెడ్ కళాశాలల విలీనం వలన ఎంతో మంది పేద విద్యార్దులు నష్టపోతారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 16న రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చినట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలలో విద్యార్థులు తరపున తమ గళం వినిపిస్తామన్నారు.

"ఎయిడెడ్​ విద్యాసంస్థలను రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలి. ఎయిడెడ్​ పాత విధానాన్నే కొనసాగించాలి. అంతేకాకుండా ఎయిడెడ్​ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి" -అశోక్ బాబు, ఎమ్మెల్సీ

అనంతపురంలో..

ఎస్​ఎస్​బీఎన్​( S.S.B.N.) కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని ఆ కళాశాల మేనేజ్‌మెంట్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎయిడెడ్ గా కొనసాగాలని సమావేశంలో తీర్మానించిన ప్రతిని...... జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి ఇవ్వటానికి యాజమాన్యం వెళ్లగా... ఆమె అందుబాటులో లేకపోవటంతో డీఆర్​ఓ(D.R.O.)కి ఆ ప్రతిని అందించారు.

మెమో జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

ఎయిడెడ్‌(aided) సంస్థల విలీన మార్గదర్శకాలతో ఉన్నత విద్యాశాఖ(Higher educational department) అంతర్గత మెమో( memo) జారీ చేసింది. ఎయిడెడ్‌ సంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనల(protest)తో మెమో విడుదల చేసింది. 2,249 సంస్థల్లో 68.78 శాతం విలీనానికి అంగీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

విలీనానికి ఒప్పుకోని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. విలీనానికి 4 ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఉందని ఉన్నత విద్యాశాఖ మెమోలో తెలిపింది. ఈ ఆప్షన్లను తప్పక పాటించాలని సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

  • ఆప్షన్‌-1: ఆస్తులు, సిబ్బంది సహా ప్రభుత్వంలో విలీనానికి సుముఖత
  • ఆప్షన్‌-2: సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి అన్‌ఎయిడెడ్‌గా కొనసాగే అవకాశం
  • ఆప్షన్‌-3: ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ విద్యాసంస్థగా కొనసాగే అవకాశం
  • ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారం వెనక్కి తీసుకునే అవకాశం

ఇదీ చదవండి: CM Jagan: ఆస్పత్రికి ముఖ్యమంత్రి జగన్‌... అపాయింట్‌మెంట్లన్నీ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.