ETV Bharat / city

మిరప సాగుపై రైతుల్లో ఆసక్తి.. విత్తన ధరలు పెంచి కంపెనీల దోపిడీ!

మిరప సాగుపై రైతుల్లో పెరుగుతున్న ఆసక్తిని విత్తన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. పంట ఉత్పత్తి అధికంగా వచ్చే, తెగుళ్లను తట్టుకొనే కొన్ని రకాల విత్తనాల ధరలను అమాంతం పెంచేశాయి. గతేడాది మిర్చి పంట లాభాలు తెచ్చిపెట్టడంతో ఈసారి సాగు విస్తీర్ణం పెరగవచ్చన్న అంచనాల నడుమ కంపెనీలు దోపిడీకి తెరలేపాయి. రైతుభరోసా కేంద్రాల ద్వారానే విత్తనం అమ్మాలని ప్రభుత్వం ఆదేశించినా గ్రామాల్లో సరైన అవగాహన లోపించింది. అక్కడక్కడ రైతులు అడుగుతున్నా.. సరిపడా స్టాకు లేదన్న సమాధానం వస్తోంది.

మిరప సాగుపై రైతుల్లో ఆసక్తి.. విత్తన ధరలు పెంచేసి కంపెనీల దోపిడీ

author img

By

Published : Jun 9, 2021, 7:12 AM IST

రాష్ట్రంలో గతేడాది 4 లక్షల ఎకరాల్లో మిరప పంట సాగైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1.90 లక్షల ఎకరాల్లో వేశారు. ప్రకాశం జిల్లాలో 1.22 లక్షలు, కర్నూలులో 49 వేలు, కృష్ణాలో 30 వేలు, అనంతపురంలో 23 వేల ఎకరాల్లో సాగైంది. మూడో వంతుకు పైగా విస్తీర్ణంలో హైబ్రిడ్‌ రకాలనే వేశారు. కొన్ని సన్నరకాల పంట క్వింటాలుకు రూ.20 వేల వరకు ధర పలకడంతో రైతులకు మంచి ఆదాయం లభించింది. బ్యాడిగ రకం మిరప కర్ణాటకలో క్వింటాలుకు గరిష్ఠంగా రూ.50 వేలు దాటింది. రాష్ట్రంలోనూ రూ.25 వేలకు పైగానే కొనుగోలు చేశారు. వచ్చే ఏడాదీ ధరలు బాగుంటాయని ఆశిస్తున్న అన్నదాతలు.. ఖరీఫ్‌లో సన్న, బ్యాడిగ రకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి 15 శాతానికి పైగా సాగు పెరుగుతుందని అంచనా.

ఖర్చులు పెరుగుతున్న తీరిదీ

మిరప సాగుకు ఎకరానికి రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో సన్నరకం, అనంతపురం జిల్లాలో బ్యాడిగ రకం సాగు అధికంగా ఉంది. మిరప పంటకు జెమిని వైరస్‌ సోకితే మొక్కలు గిడసబారి చనిపోతాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా నియంత్రించడం కష్టం. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి నాలుగైదు క్వింటాళ్లకు పడిపోతుంది. గతేడాది కొన్ని రకాలు వైరస్‌ను తట్టుకొని నిలబడ్డాయి. సన్నరకాల్లో కొన్ని మంచి దిగుబడులు ఇచ్చాయి. ఇప్పుడు ఆయా రకాల విత్తనాలకే డిమాండు అధికంగా ఉంది.

  • ఓ రకం కిలో విత్తనం ఎమ్మార్పీ రూ.81,000 ఉంటే రూ.1,30,000కు పైగా విక్రయిస్తున్నారు. కిలో రూ.69,900 ఉన్న మరో రకానికి ప్రకాశం జిల్లాలో రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. మరో ఐదు రకాలకూ కిలోకు రూ.15వేలకు పైగా దండుకుంటున్నారు.
  • బ్యాడిగలోనూ కొన్ని హైబ్రిడ్‌ రకాల ధరలు పెంచేశారు. ఎమ్మార్పీ కిలో రూ.88 వేలు ఉంటే, ఏకంగా రూ.1.30 లక్షలు తీసుకుంటున్నారు.
  • ఎకరం మిరప సాగుకు 100 గ్రాముల హైబ్రిడ్‌ విత్తనం అవసరం. గతంలో రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చయ్యేది. పెరిగిన ధరల ప్రకారం ప్రస్తుతం కొన్ని రకాలపై ఎకరానికి రూ.13వేల పైనే అవుతోంది.
  • నాటు రకాలైతే ఎద పద్ధతిలో విత్తుతారు. హైబ్రిడ్‌ విత్తనాలైతే నారు పెంచి తర్వాత పొలంలో నాటుతారు. నర్సరీల్లోని ప్లాస్టిక్‌ ట్రేల్లో పెంచిన నారుకు డిమాండు అధికం. ఆరుబయట పెంచే నారుతో పోల్చితే, దీని మొలక శాతం ఎక్కువ. పైగా చీడపీడల నుంచి రక్షణ ఉంటుంది. దీంతో రైతులు విత్తనం కొనుక్కొని నర్సరీల్లో నాటిస్తున్నారు. ఇందుకు ఒక్కో మొక్కపై 50-55 పైసల వరకు వెచ్చిస్తున్నారు. ఎకరానికి సగటున 12 వేల మొక్కలు అవసరమైనా రూ.6 వేల పైనే ఖర్చవుతుంది.
  • విత్తనం ఖర్చు కూడా నర్సరీ యజమానులే భరించి నారు పెంచినట్లైతే ఒక్కో మొక్కకు డిమాండును బట్టి రూ.1 నుంచి రూ.1.50 చొప్పున తీసుకుంటారు. ఈ లెక్కన ఎకరానికి రూ.12 వేల నుంచి రూ.18 వేల ఖర్చవుతుంది.

ఆర్‌బీకేల ద్వారా విక్రయిస్తున్నాం
రాష్ట్రంలో మిరప విత్తనాలకు కొరత లేదు. 22,200 కిలోల హైబ్రిడ్‌ విత్తనాలు అవసరం కాగా.. 29,500 కిలోలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ రకాల విత్తనం 2.96 లక్షల కిలోలు కావాల్సి ఉంటే 3.50 లక్షల కిలోలు సిద్ధంగా ఉంది. కొన్ని రకాలకు డిమాండు అధికంగా ఉండటం, ధరలు పెంచి అమ్ముతున్నారనే సమాచారంతో వాటిని రైతుభరోసా కేంద్రాల ద్వారానే విక్రయించాలని నిర్ణయించాం. రైతులు ఆర్‌బీకేల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. దీనిపై అవగాహన కోసం ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు నిర్వహించడంతోపాటు మార్కెట్లోనూ తనిఖీలు చేపట్టాం. ఉద్యానశాఖ సూచన మేరకు వేర్వేరు రకాల సాగును ప్రోత్సహిస్తున్నాం. - హెచ్‌.అరుణ్‌కుమార్‌, కమిషనర్‌, వ్యవసాయశాఖ

ఇదీ చదవండి:

Jagan cases: జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.