ETV Bharat / city

2 వారాల్లో.. 2 శాతం పాజిటివ్ రేట్ తగ్గుదల: కలెక్టర్‌ ఇంతియాజ్‌

కృష్ణా జిల్లాలో గత రెండు వారాల్లో రెండు శాతం పాజిటివ్ రేట్ తగ్గుదల నమోదైందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణకు జిల్లాలోని ఇళ్లను సర్వే బృందాలు సందర్శించడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.

author img

By

Published : May 17, 2021, 9:00 AM IST

intiyaz
intiyaz

కృష్ణా జిల్లాలో గత రెండు వారాల్లో రెండు శాతం పాజిటివ్ రేట్ తగ్గుదల ఉందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. జిల్లాలో కొవిడ్ పరిస్థితులపై సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ , కొవిడ్ పర్యవేక్షణ ఛైర్మన్ జవహర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ సింఘాల్ నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు.

కొవిడ్ నియంత్రణకు జిల్లాలోని 14,96,181 ఇళ్లను సర్వే బృందాలు సందర్శించడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. గత రెండు రోజులుగా 4లక్షల 93 వేల 734 (33 శాతం) ఇళ్ల నుంచి సమాచారం సేకరించగా.. వాటిలో 4,111 మంది కుటుంబాల్లో జ్వరం, కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారిని గుర్తించామన్నారు. జిల్లాలో మొత్తం 4,506 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 7,01,371 మందికి వాక్సినేషన్ వేసామన్నారు. జిల్లాలోని ఆసుపత్రులకు డివిస్ లాబ్రోరెటరీ 200 ఆక్సీజన్ సీలిండర్లు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 100 ఆక్సీజన్ సీలిండర్లు అందించినట్లు తెలిపారు.

జిల్లాలో మే 2 నుంచి 8 వరకు 56,575 కరోనా పరిక్షలు నిర్వహించగా 6,821 (12.06 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 9 నుంచి 15 వరకు 57,055 పరీక్షలు నిర్వహించాగా 6,311 (11.06 శాతం) కేసులు నమోదయ్యాయి. గత 4 రోజులుగా జిల్లాలో 37,281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాగా 3,700 మంది పాజిటివ్ కేసులు గుర్తించమన్నారు. ఈ టెస్టుల్లో 9.92 శాతం మందికి మాత్రమే వైరస్ తేలింది అని కలెక్టర్ వివరించారు.

ఇదీ చదవండి:

రఘురామను రమేశ్‌ ఆస్పత్రికి పంపడంపై ఏఏజీ అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.