తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌ననగర్ మండలం సిర్పూర్ (టి)కి చెందిన మేరీ శారద అనే 90 సంవత్సరాల వృద్ధురాలు.. జిల్లా పాలనాధికారి సందీప్‌కుమార్ ఝాను కలిసేందుకు కలెక్టరేట్‌కు వచ్చింది. కలెక్టర్ ఆమె వద్దకు వచ్చి.. ఏం సహాయం కావాలమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించారు.
కలెక్టర్ సారును కలుద్దామని వచ్చిన కొడుకా అని వృద్ధురాలు చెప్పగా.. నేనేనమ్మా అంటూ ఆమెకి ఎదురుగా కూర్చొని ఆమె చెప్పిన సమస్యను ఓపిగ్గా విన్నారు. ఏ దిక్కు లేని తనకు ఆశ్రయం కల్పించి ఆదుకోవాలని ఆ ముసలవ్వ కోరగా.. వెంటనే మహిళా శిశు సంక్షేమ అధికారిణిని పిలిచి గోలేటిలోని వృద్ధాశ్రమానికి తరలించారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తనకు ఆశ్రయం కల్పించిన కలెక్టర్‌కు ముసలమ్మ కృతజ్ఞతలు తెలిపింది.