ETV Bharat / city

తెదేపాను కలవరపెడుతున్న వర్గ విభేదాలు! - విజయవాడ మున్సిపల్ ఎన్నికలు

అంతా ఒకపార్టీవారే..! ఒక గూటిపక్షులే..! అయినా ఒకరంటే ఒకరికి పడట్లేదు. పార్టీలో బలం నిలుపుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాష్ట్రం నడిబొడ్డున విజయవాడలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. కంచుకోట అనుకున్న స్థానంలో విభేదాలు బయటపడటం.. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది.

cold war between kesineni nani, budha
తెదేపాను కలవరపెడుతున్న వర్గ విభేదాలు
author img

By

Published : Feb 19, 2021, 1:21 PM IST

తెదేపాను కలవరపెడుతున్న వర్గ విభేదాలు!

మరికొన్ని రోజుల్లో పురపాలక ఎన్నికలు జరగబోతున్న వేళ.. విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలూ లేకపోయినా.. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత దెబ్బతిన్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి ఖరారైనట్టు ఓ వర్గం ప్రచారంలో దూసుకుపోతుంటే.. మరో వర్గం మాత్రం అధిష్ఠానం ఇంకా ప్రకటించలేదని స్పష్టం చేస్తోంది.

మార్చి 10న విజయవాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనుండగా ఎంపీ కేశినేని ఇటీవలే పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రచారం ప్రారంభించారు. అక్కడ ప్రస్తుతం పార్టీ ఇన్‌ఛార్జ్‌ ఎవరూ లేనప్పటికీ నాగుల్‌మీరా అనధికారికంగా ఆ బాధ్యతలు చూస్తున్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వర్గీయులు సైతం చురుగ్గా ఉన్నారు. 2019 ఎన్నికల ముందువరకూ.. బుద్దా, నాగుల్‌మీరా, జలీల్‌ఖాన్‌, బొండా ఉమ.. కేశినేనికి విధేయులుగా ఉండేవారు. ఎన్నికల తర్వాత వీరి మధ్య గ్రూపులు ఎక్కువై.. బుద్దా, నాగుల్‌మీరా ఒక్కటవగా.. బొండా ఉమ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్టు పార్టీ అంతర్గత సమాచారం.

గతంలో కేశినేని, బుద్దా మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ప్రస్తుతం కేశినేని నాని తమను సంప్రదించకుండా కార్పొరేటర్‌ అభ్యర్థులను మార్చారని మరో వర్గంవారు ఆరోపిస్తున్నారు. ప్రచారానికి ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఎన్నికల వేళ ఇలాంటివి సహజమేనంటున్న తెదేపా నేతలు.. పార్టీలో గ్రూపులున్నాయన్న వదంతులను కొట్టిపారేశారు. కేశినేని నాని కుమార్తె శ్వేత.. తూర్పు నియోజకవర్గంలోని 10వ డివిజన్‌ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఆ ప్రాంతంలో పార్టీకి గట్టి పట్టు ఉన్నా.. పక్క నియోజకవర్గాల్లో విభేదాలు నష్టం చేకూరుస్తాయని తెదేపా వర్గాల్లో ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి:

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.