ETV Bharat / city

కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన - కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

విజయవాడలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దుర్గ గుడిలో చేపట్టిన మరో 8 పనులకు సీఎం భూమిపూజ నిర్వహించారు. శనీశ్వరస్వామి ఆలయ నిర్మాణం ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం దుర్గమ్మను ముఖ్యమంత్రి జగన్ దర్శించుకున్నారు.

cm jagan taza
cm jagan taza
author img

By

Published : Jan 8, 2021, 11:56 AM IST

Updated : Jan 8, 2021, 2:25 PM IST

కృష్ణా తీరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

విజయవాడలో కృష్ణానదీ తీరంలో 9 దేవాలయాల పునర్‌ నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌ భూమిపూజ చేశారు. శనీశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో ముహూర్తం ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పురోహితులు ప్రత్యేక పూజలు చేయగా.. శాస్త్రోక్తంగా సీఎం జగన్ ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, బొత్స సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రకాశం బ్యారేజీ దిగువన పై వంతెన ఆనుకున్న ఉన్న ప్రాంతంలో ఆలయాలు నిర్మిస్తున్నారు. రాహు – కేతు ఆలయం, శ్రీ సీతమ్మ పాదాలు, దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ శనీశ్వర ఆలయం పునర్‌ నిర్మాణం, బొడ్డు బొమ్మ, ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం, వీరబాబు ఆలయం, కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల లను పునర్నిర్మించనున్నారు. ఆల‌యాల నిర్మాణం దేవాదాయ శాఖ‌ చేపట్టనుండగా.. సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను పుర‌పాల‌క శాఖ చేప‌ట్టనుంది.

వీటితో పాటు రూ. 77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. శిలా పలకాన్ని ఆవిష్కరించారు. దుర్గ గుడి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 70 కోట్లు నిధులు ఇస్తుండగా.. దేవ స్థానం రూ. 7కోట్లు వెచ్చిస్తోంది. భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.

అనంతరం ఇంద్రకీలాద్రి పై వెలసిన దుర్గమ్మను సీఎం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సురేష్ బాబు, ఛైర్మన్ పైలా సోమినాయుడు స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారికి ఆభరణాలను సీఎం చేతులమీదుగా అందించారు. దేవాలయాలు సహా దుర్గగుడి అభివృద్ధి విస్తరణ పనులపై సత్వరమే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

దుర్గగుడిలో అభివృద్ధి పనుల వివరాలు..

  • రూ.8.5 కోట్లతో ప్రసాదంపోటు భవన పునర్నిర్మాణం
  • రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం
  • రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ
  • రూ.23.6 కోట్లతో కేశఖండనశాల భవన నిర్మాణం
  • రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం
  • రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా నిర్మాణం
  • రూ.6.5 కోట్ల నిధులతో ఘాట్‌ రోడ్‌లో మరమ్మతులు
  • కొండచరియలు విరిగి పడకుండా మరమ్మతులు, పటిష్ట చర్యలు
  • రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పనులు

ఇదీ చదవండి: 'అధీర పాత్ర కోసం గంటన్నర మేకప్‌‌'

Last Updated : Jan 8, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.