రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు . ఈ పండుగ అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలి. -బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
'దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా మహిళలు సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.' -వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
'కులమతాలకు అతీతంగా నిర్వహించుకునేది రాఖీ పండుగ. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను, ఆప్యాయతలను నింపే పండగ రక్షాబంధన్. స్త్రీపురుషులందరూ సోదరభావంతో మెలిగినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావుండదు. సోదర బంధానికి ప్రతీకగా రాఖీ పండుగను నిర్వహించుకుంటారు. మానవీయ సంబంధాలను ఇది మరింత పటిష్ఠం చేస్తుంది.' -చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత
'హత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు బాధ కలిగిస్తున్నాయి. గుంటూరు రమ్య హత్య, విజయనగరంలో రాములమ్మపై హత్యాయత్నం వంటి దుస్సంఘటనలు మనసును కలిచి వేస్తున్నాయి. ఆడపిల్లలంతా మన అక్కాచెల్లెళ్లు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. ఆడపడుచులు నిర్భయంగా తిరిగేలా భరోసా ఇవ్వాలి. భారతీయుల బాంధవ్యాలను చాటిచెప్పే వేడుకే రక్షాబంధన్. దేశం బలంగా ఉండాలంటే కుటుంబాలు సమైక్యంగా ఉండాలి' -పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు
తోడబుట్టిన అక్క చెల్లెళ్లకే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా అండగా నిలవడం మన కర్తవ్యమని భారతీయ సంస్కృతి చెబుతోంది. సమాజంలో స్త్రీ కి రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. -నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇదీచదవండి.