ETV Bharat / city

రహదారుల మరమ్మతుల వేగవంతానికి సీఎం జగన్ ఆదేశం: మంత్రి సురేశ్ - సీఎం జగన్ లేటెస్ట్ న్యూస్

CM Review on Roads: రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జిలు, ఆర్​వోబీల నిర్మాణాలను వచ్చే నెల 15 లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల పరిధిలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై సీఎం సమీక్షించినట్లు తెలిపారు.

రహదారుల మరమ్మతుల వేగవంతానికి సీఎం జగన్ ఆదేశం

author img

By

Published : Jun 21, 2022, 3:33 PM IST

Updated : Jun 21, 2022, 3:50 PM IST

రహదారుల మరమ్మతుల వేగవంతానికి సీఎం జగన్ ఆదేశం

రహదారుల మరమ్మతుల వేగవంతానికి ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పురపాలక శాఖ పరిధిలో జులై 15లోపు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అర్​ఆండ్​బీ, పంచాయతీ రాజ్, పురపాలక శాఖల పరిధిలో రోడ్ల మరమ్మతుల, నిర్మాణంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు వెల్లడించారు.

రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. పురపాలక శాఖ పరిధిలోని 4 వేల పైచిలుకు కి.మీ జూలై 15 లోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 27 వేల కి.మీ పైగా పంచాయతీ రోడ్లను శాచురేషన్ పద్దతిలో అభివృద్ది చేయాలని జగన్ దిశానిర్ధేశం చేశారన్నారు. జూలై 20 లోపు మరమ్మతులు, నిర్మాణం పూర్తి చేసి నాడు-నేడు కింద ప్రదర్శించాలని సీఎం ఆదేశించారన్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్ కనెక్టెడ్ హాబిట్ విలేజీలకు 5 వేల కి.మీ రోడ్లు పూర్తి చేశామని తెలిపారు.

నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా బైజూస్ పేరొందిందని.., ప్రభుత్వ పాఠశాల్లోని పేద పిల్లలకు ఉచితంగా విద్యనందించేందుకు బైజూస్ ముందుకొచ్చిందని మంత్రి తెలిపారు. అలాంటి సంస్థను 'జగన్ జూస్' అని చంద్రబాబు వెటకారంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏటా 8 తరగతి విద్యార్థులకు రూ.500 కోట్లతో ప్రభుత్వం తరపున ట్యాబ్​లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యనందిస్తుంటే చంద్రబాబు అవాకులు, చవాకులు పేలటం శోచనీయమన్నారు.

ఇవీ చూడండి

Last Updated : Jun 21, 2022, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.