ETV Bharat / city

కొత్త జిల్లాలపై ఏం చేద్దాం.. సీఎం జగన్ రివ్యూ

CM Review on new districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లాల ఏర్పాటుపై ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

CM Jagan Review on new districts in andhra pradesh

author img

By

Published : Mar 30, 2022, 12:54 PM IST

CM Review on new districts: కొత్త జిల్లాలపై సీఎం జగన్​ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలపై అందిన ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు ప్రకటించిన తర్వాత పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లాల పేరు మార్పు, జిల్లా కేంద్రం మార్పు.. పలు గ్రామాలను వేరే జిల్లాలో కలపడం వంటి డిమాండ్లు తెరపైకి వచ్చాయి. వాటిని వడపోసి, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విన్నపాలను పరిశీలించి.. అంతిమ నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో.. జిల్లాల ఏర్పాటుపై గురు లేదా శుక్రవారం తుది నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఊపందుకున్న ఏర్పాట్లు.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండటంతో ప్రతిపాదించిన జిల్లాల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వెలువడనుండటంతో అప్పటికల్లా ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులు శ్రమిస్తున్నారు. బాపట్ల కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లా కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 6 నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతో పాటు మరికొన్ని ప్రధాన శాఖల కార్యాలయాల కోసం భవనాలు ముస్తాబవుతున్నాయి.

బాపట్ల కేంద్రంగా ఏర్పాటుకాబోతున్న కొత్త జిల్లా కోసం ఇప్పటికే అనేక భవనాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్‌ అండ్ బీ విభాగం ఆధ్వర్యంలో భవనాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు మరమ్మతులు చేయిస్తున్నాం. బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కోసం ఎప్పటి నుంచో ప్రతిపాదనలున్నాయి. అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది. బాపట్ల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కావటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ఏర్పడనున్న మన్యం జిల్లాకు ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు గుర్తించి.. మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఐటీడీఏ నూతన భవనంలో ఏర్పాటు కాబోతున్న కలెక్టరు, జేసీ, సీఈవో కార్యాలయాల్లో 80శాతం పనులు పూర్తయ్యాయి.

ఇదీ చదవండి:
New Collectorate: కొత్త పాలనకు చకచకా ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.