CM Jagan Review on Flood situation: గోదావరి వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని ఆదేశించిన ఆయన, సహాయక బృందాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సౌకర్యాల కల్పన, సేవలు నాణ్యంగా ఉండాలని..సీఎం అధికారులకు తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వెయ్యి చొప్పున నగదు అందించాలని ఆదేశాలిచ్చారు. బాధితులంతా శిబిరాలు విడిచి వెళ్లేలోగా సహాయం పంపిణీ చేయాలన్న సీఎం జగన్.. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వరద బాధిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై అధికార్లు సీఎం నివేదించారు.
ఇవీ చూడండి: