వైఎస్సార్ చేయూత నిధులు నేడు విడుదల కానున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. 45-60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. రెండో ఏడాదికి సబంధించిన నిధులను ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. విడుదలైన నిధులు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
మెుత్తం 23 లక్షల 14 వేల 342 మంది లబ్ధిదారులకు 4 వేల 339.39 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. వరుసగా నాలుగేళ్ళలో మొత్తం 75 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. మహిళ ఆర్థిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ చేయూత అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీచదవండి
CM Jagan: కొవిడ్ వ్యాప్తిపై మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్