CM Jagan presented petition to PM Modi: విజయవాడ విమానాశ్రయంలో వీడ్కోలు సమయంలో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ వినతిపత్రం అందజేశారు. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు. రీసోర్స్ గ్యాప్ గ్రాంట్ అంశాన్ని ప్రస్తావించిన జగన్.. దానికింద రూ.34,125 కోట్లు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ డిస్కంలు ఇవ్వాల్సిన రూ.6,627 కోట్లు ఇప్పించాలని ప్రధానిని కోరారు. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇచ్చే రేషన్‌లో హేతుబద్ధత లేదన్న సీఎం.. ఫలితంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని విన్నవించారు. చట్టాన్ని సవరించి రాష్ట్రానికి మేలు చేసే చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సాయం చేయాలని మోదీని జగన్ విజ్ఞప్తి చేశారు. భోగాపురం విమానాశ్రయానికి క్లియరెన్స్‌లు ఇవ్వాలని.. ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని మోదీని కోరారు.
ఇవీ చదవండి: దేశభక్తుల పురిటిగడ్డ ఆంధ్ర.. అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి : ప్రధాని మోదీ