ETV Bharat / city

'కృష్ణాపై కట్టే ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదు'

కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని సీఎం జగన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం 800 అడుగుల వద్దే ప్రాజెక్టులు చేపడుతుందోన్న జగన్... అదే లెవల్​లో ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపారు.

cm jagana
cm jagana
author img

By

Published : May 26, 2020, 3:56 PM IST

Updated : May 26, 2020, 5:46 PM IST

మన పాలన- మీ సూచనలో సీఎం జగన్

రాయలసీమ కరవు నివారణ కోసం ప్రాజెక్టులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే వీటిపై కొందరు వివాదాలు సృష్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. 'మన పాలన - మీ సూచన' పేరిట రెండో రోజు జరిగిన మేథో మధన సదస్సులో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలంలో 796 అడుగులకే తెలంగాణ వాళ్లు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారని సీఎం అన్నారు. ఇలా అయితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఏ విధంగా నీళ్లు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపించేందుకు 800 అడుగుల వద్ద 2 టీఎంసీలతో పంపులు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కృష్ణా నదిపై కట్టే ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. మనకు కేటాయించిన నీటినే మనం తీసుకుంటామని అన్నారు.

రాయలసీమ కరవు నివారణకు రూ.27 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తామని సీఎం జగన్ తెలిపారు. మరోవైపు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 50వేల క్యూసెక్కుల నీటిని తీసుకువచ్చేలా కెపాసిటీ పెంచుతామని వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుందని సీఎం అన్నారు.

ఇదీ చదవండి

'వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం'

Last Updated : May 26, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.