ETV Bharat / city

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. విహంగ వీక్షణం ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పర్యటించి వరద నష్టంపై ఆరా తీయనున్నారు.

రేపు తుపాను ప్రభావిత జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

author img

By

Published : Nov 28, 2020, 1:50 AM IST

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. హెలికాప్టర్​లో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమావేశమై...తుపాను ప్రభావంపై సమీక్షించనున్నారు. నివర్‌ తుపానుపై కేబినెట్‌ సమావేశంలోనూ చర్చించిన సీఎం.... దెబ్బతిన్న పంటలకు డిసెంబర్‌ 30 కల్లా పంట నష్ట పరిహారాన్ని అందించాలని ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ. 500 ఇవ్వాలన్నారు

తుపాను ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే వివరాలు అందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తుపాను కారణంగా మరణించిన కుటుంబాలను ఆదుకోవాలన్నారు. వర్షాల అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఏదైనా నష్టం వాటిల్లితే సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇదీచదవండి

నివర్‌ ధాటికి అతలాకుతలం...స్తంభించిన జనజీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.