ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: రెండు విడతల్లో విద్యార్థులకు తరగతులు - కరోనా ఎఫెక్ట్: రెండు విడతల్లో విద్యార్థులకు తరగతులు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.తరగతి గదిలో 30మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు విడతలుగా తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరకులను పంపిణీ చేయాలని సూచించింది.

కరోనా ఎఫెక్ట్: రెండు విడతల్లో విద్యార్థులకు తరగతులు

author img

By

Published : Jun 6, 2020, 9:09 AM IST

తరగతి గదిలో 30మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు విడతలుగా తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరకులను పంపిణీ చేయాలని సూచించింది.

పాఠశాలను తెరిచే సమయంలో..
* పాఠశాల ఆవరణను కరోనా వైరస్‌ రహితంగా శుద్ధి చేయాలి.
* ప్రవేశ ద్వారం వద్ద విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాలి.
* 30మంది పిల్లలకు రెండు చొప్పున ఆటోమేటెడ్‌ చేతులు కడిగే యంత్రాలు ఏర్పాటు చేయాలి.
* వస్త్ర మాస్కులను విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందించాలి.
* ఏకరూప దుస్తులతోపాటు చేతిరుమాలు తప్పనిసరి.
* సబ్బులు, శానిటైజర్లను ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉంచాలి.

తరగతుల నిర్వహణ సమయంలో..
* ఉదయం నిర్వహించే ప్రార్థన రద్దు. తరగతి గదిలో మైకుల ద్వారా చేయించుకోవచ్చు.
* 30మంది విద్యార్థులు మించి ఉంటే ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 12.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండు విడతల్లో నిర్వహించాలి.
* 50-100మంది ఉంటే రోజు విడిచి రోజు నిర్వహించాలి. మొదటి రోజు కొందరికి రెండు విడతలు, మరుసటి రోజు రెండు విడతల్లో మరి కొందరికి తరగతులు నిర్వహించాలి.
* తాగునీరు, మధ్యాహ్న భోజనానికి విడతకు 10 మందికి మించి ఉండకూడదు.
* ప్రతి రోజు 15నిమిషాలు కొవిడ్‌-19 నివారణ చర్యలను వివరించాలి.
* ఆటల పీరియడ్‌ను రద్దు చేయాలి. వ్యక్తిగత వ్యాయామాలు, యోగా నేర్పించవచ్చు.
* ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ నిర్వహించాలి. పిల్లల్లో ఒత్తిడి తగ్గించేందుకు సినిమాలు లాంటివి చూపించాలి.
* సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరకులను అందించాలి.

పరీక్షల్లో గదికి 10 మంది మాత్రమే..

* పరీక్ష కేంద్రాల వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాలి.
* ఒక్కో గదిలో 10మందిని మాత్రమే పరీక్షకు అనుమతించాలి.
* కట్టడి ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు కలెక్టర్లు రవాణా సదుపాయం కల్పించాలి.
* కరోనా అనుమానిత లక్షణాలు ఉండే వారి కోసం ప్రత్యేక ఐసొలేషన్‌ గది ఏర్పాటు చేయాలి.
* మూల్యాంకన కేంద్రాలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.