ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430...పాత్రికేయుల పాలిట ఉపా చట్టం అని పౌరహక్కుల సంఘం నాయకులు విజయవాడలో అన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉన్న ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ చిలక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి విరుద్ధమైన, పౌరహక్కులు కాలరాసే చట్టాలను రద్దు చేయాలన్నారు.
కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని మేధావులు, న్యాయమూర్తులు సూచిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించినా...నిర్బంధ చట్టాలతో కేసులు పెడుతున్నారన్నారు. నిర్బంధ చట్టాలను రద్దు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి అందరు కలిసి రావాలన్నారు.