ETV Bharat / city

బొత్స సత్యనారాయణ.. అబద్ధాల శాఖకు మంత్రి అయ్యారా?: చినరాజప్ప

మంత్రి బొత్స సత్యనారాయణ పై తెదేపా నేత చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్స అబద్ధాల శాఖకు ఎప్పుడు మంత్రి అయ్యారని ప్రశ్నించారు.

Chinarajappa comments On Botsa
తెదేపా నేత చినరాజప్ప
author img

By

Published : Jun 15, 2020, 6:13 PM IST

Chinarajappa comments On Botsa
తెదేపా నేత చినరాజప్ప లేఖ

అమరావతిపై గతంలో అబద్దాలాడి అభాసుపాలైన మంత్రి బొత్స ఇప్పుడు అచ్చెన్నాయుడిపై కూడా అదేవిధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. అబద్ధాల శాఖకు మంత్రిగా బొత్స వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సిఫారసు లేఖ ఇచ్చిన దానికే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే... వోక్స్ వేగన్​కి రూ.10 కోట్లు కట్టబెట్టిన బొత్సని ఎందుకు అరెస్ట్ చేయకూడదని నిలదీశారు.

బీసీలకు రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి జగన్మోహన్ రెడ్డి తగ్గిస్తే కనీసం నోరుమెదపడానికి భయపడిన బొత్సకు మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్​లో మంత్రిగా ఉన్న సమయంలో జగన్​ను తిట్టిన బొత్స... నేడు అదే జగన్ వద్ద ప్రాపకం కోసం తెదేపాపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ఈఎస్​ఐ మందుల కుంభకోణంలో చంద్రబాబుకూ వాటా ఉంది: బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.