ETV Bharat / city

అమ్మో చికెన్.. ధర చూసి జనం షాక్ - హైదరాబాద్​లో చికెన్​ ధర

చికెన్​ రేటు ఆల్​టైమ్​ రికార్డును కూడా బద్దలు కొట్టింది. కిలో ఏకంగా రూ.300 దాటేసింది. రంజాన్‌ నెల కావడం, ఇళ్లలో పెరిగిన వినియోగం కూడా ఇందుకు కారణమని తెలంగాణ రాష్ట్ర కోళ్ల ఫారాల సమాఖ్య అధ్యక్షుడు తెలిపారు. మరో 3, 4 వారాల్లో ధర తగ్గుతుందని.. అప్పటికి దుకాణాలకు కోళ్ల సరఫరా పెరుగుతుందన్నారు.

chicken-price-rises-to-rs-300-in-telangana-with-huge-demand

author img

By

Published : May 18, 2020, 10:11 PM IST

చికెన్‌ ధర చుక్కలు చూపిస్తోంది. ఆదివారం తెలంగాణలోని కొన్నిచోట్ల కిలో రూ.300 నుంచి 310 రూపాయల వరకూ విక్రయించారు. తెలంగాణలో ఇదే అత్యధిక రికార్డు. ఫారాల యజమానులు దుకాణాలకు అవసరమైనన్ని కోళ్లు సరఫరా చేయలేకపోతున్నారు. సాధారణ పరిస్థితుల్లో తెలంగాణలో రోజుకు సగటున 7.5 లక్షల కిలోల నుంచి 8 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తారు. ఆదివారం 24 లక్షల కిలోల వరకూ అమ్మకాలుంటాయి. లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణలో నెలకు దాదాపు 4.20 కోట్ల కోడి పిల్లలను ఉత్పత్తి చేసేవారు.

రంజాన్​ నెల కావడంతో..

ఇప్పుడు వాటి సంఖ్య 2.8 కోట్లకు తగ్గిపోయింది. కరోనా నేపథ్యంలో చికెన్‌ అందరూ తినాలని వైద్యులు, ప్రభుత్వం చెప్పడంతో కొనుగోలుదారుల సంఖ్య పెరిగి ధరకు రెక్కలొచ్చాయి. రంజాన్‌ నెల కావడం, ఇళ్లలో పెరిగిన వినియోగం కూడా ఇందుకు కారణమని రాష్ట్ర కోళ్ల ఫారాల సమాఖ్య అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చెప్పారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పుడు మాంసానికి డిమాండు పడిపోవడంతో కోళ్లను పెంచలేక ఫారాల యజమానులు కొందరు ప్రజలకు ఉచితంగా ఇచ్చేశారు. కొందరు తక్కువ ధరకు అమ్మేశారు. అప్పుడు కోళ్లఫారాలు దాదాపు ఖాళీ అయ్యాయి. దానివల్ల మార్కెట్‌లో కోళ్లకు ఇప్పుడు తీవ్ర కొరత ఏర్పడిందని వివరించారు. మరో 3, 4 వారాల్లో ధర తగ్గుతుందని అప్పటికి దుకాణాలకు కోళ్ల సరఫరా పెరుగుతుందని చెప్పారు.

అమాంతం పెరిగి ధర..

వాస్తవానికి హోటళ్లు, ఇతరత్రా ఫంక్షన్లు, సామూహిక భోజనాలు వంటివేవీ లేనందున సాధారణ డిమాండు కన్నా కోడి మాంసం అమ్మకాలు తగ్గాయి. అవి కూడా ఉండి ఉంటే డిమాండు అమాంతం పెరిగి ధర మరింత అధికమయ్యేదని వెంకటేశ్వర హేచరీస్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.బాలసుబ్రమణియన్‌ తెలిపారు. వచ్చే నెల 15 తర్వాత చికెన్‌ ధర కొంత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'తెలంగాణ విభజన చట్టాన్ని అతిక్రమిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.