ETV Bharat / city

Chicken Price Hike in telangana : మాంసం ప్రియులకు బ్యాడ్​న్యూస్.. భారీగా పెరిగిన చికెన్​ధర..! - తెలంగాణలో చికెన్ ధర

Chicken Price Hike in telangana : కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మాంసాహారానికి డిమాండ్ బాగా పెరిగింది. అప్పట్నుంచి మాంసం ధరలు కొండెక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చికెన్ ధర బాగా పెరుగుతోంది. తెలంగాణలో 20 రోజుల క్రితం కిలో రూ.175 ఉండగా ఇప్పుడు రూ.280కి విక్రయిస్తున్నారు.

Chicken Price Hike in telangana
భారీగా పెరిగిన చికెన్​ధర
author img

By

Published : Mar 7, 2022, 9:31 AM IST

Chicken Price Hike in telangana : కోడి మాంసం ధర బాగా పెరుగుతోంది. 20 రోజుల క్రితం కిలో రూ.175 ఉండగా.. తాజాగా రూ.280కి విక్రయిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాల అంచనా. తెలంగాణలో రోజుకు సగటున 10 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తారని అంచనా. ఆదివారం నాడు 15 లక్షల కిలోలకు పైగా ఉంటోంది. కరోనా భయం తగ్గడంతో గత పది రోజుల్లో రోజుకు అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 37-39 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ వాతావరణ మార్పులకు సర్దుబాటు కాలేక కోడిపిల్లలు మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు సోయాచెక్క, మొక్కజొన్న దాణా ధరలూ పెరిగాయి. క్వింటాలు సోయాచెక్క దాణా ధర ఏడాది క్రితం రూ.4 వేల నుంచి 5 వేలు ఉండగా.. ప్రస్తుతం 7,200 రూపాయలు ఉంది. ఈ కారణాలతో మాంసం ధర పెరిగింది.

నాటుకోడి లభ్యత లేక ధర పెరుగుదల..

Chicken Price Hike in Telangana : నాటుకోడి మాంసం ధర కిలో రూ.400 నుంచి 500కి చేరింది. నాటుకోళ్ల లభ్యత లేకపోవడంతో. ధర పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌ అడవుల్లో పెరిగే కడక్‌నాథ్‌ కోళ్లను కొందరు వ్యాపారులు తెచ్చి.. ఇక్కడి ఫారాల్లో పెంచి కిలో మాంసం రూ.500కి అమ్ముతున్నారు. ఈ మాంసంలో పోషకాలుంటాయనే ప్రచారంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుండటంతో దీని ధర కూడా పెరుగుతోంది.

పెంపకం ఖర్చులు పెరుగుతుండటంతోనే..

Chicken Price Hike in telangana
ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, తెలంగాణ రాష్ట్ర కోళ్ల పరిశ్రమ సమాఖ్య అధ్యక్షుడు

Chicken Price Increased in Telangana : "పెంపకం ఖర్చులు పెరుగుతుండటంతో కోళ్లఫారాల నిర్వహణలో నష్టాలొచ్చాయి. ధర కాస్త పెరిగి ఇప్పుడే కోలుకుంటున్నాయి. వేసవి ఎండలు ముదిరి కోళ్ల మరణాలు పెరిగితే.. ధర ఇంకా మండుతుంది."

-ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కోళ్ల పరిశ్రమ సమాఖ్య

ఇదీ చదవండి :

యుద్ధం సాకుతో వంటనూనెల ధరలకు రెక్కలు... రంగంలోకి విజిలెన్స్​ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.