ఆగస్టు 15 సందర్భంగా కొన్ని జిల్లాల్లో పతాకావిష్కరణ చేసే మంత్రుల పేర్ల జాబితాలో ప్రభుత్వం మార్పులు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు జెండాను ఆవిష్కరించనున్నారు. విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీ వాణి, అనంతపురం జిల్లాలో శంకర్ నారాయణ జెండాను ఆవిష్కరించనున్నారు. చిత్తూరు జిల్లాలో నారాయణ స్వామి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ప్రభుత్వం తెలిపింది.
విశాఖలో కె.కన్నబాబు, తూర్పుగోదావరి జిల్లాలో ధర్మాన కృష్ణదాస్, పశ్చిమ గోదావరి జిల్లాలో పేర్నినాని, గుంటూరు జిల్లాలో చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ప్రకాశం జిల్లా పినిపే విశ్వరూప్, నెల్లూరు జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్, కడప జిల్లాలో ఆదిమూలపు సురేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
విజయవాడ ఇందీరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
75వ స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందీరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ పతాకావిష్కరణ చేయనున్నారు. కరోనా దృష్ట్యా సాధారణ ప్రజలకు వేడుకలకు అనుమతి లేదని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు స్టేడియంలోని ఏర్పాట్లను పరిశీలించారు.
స్టేడియం చుట్టూ జరుగుతున్న భద్రత ఏర్పాట్లను డీజీపీ గౌతం సవాంగ్ పరిశీలించారు. ఈ ఏడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశా పోలీసులు కూడా ఒక ప్లాటున్గా పరేడ్లో పాల్గొననున్నారు. నగరవాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేసామని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలకు, వీవీఐపీలకు ప్రత్యేక స్థలాలలో పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: