స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యక రాష్ట్ర మంత్రిమండలిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్లను రాజ్యసభకు వైకాపా అభ్యర్థులుగా దాదాపుగా ఖరారు చేశారని చెబుతున్నారు. ఖాళీ అయిన వారి స్థానాలను కొత్తవారితో భర్తీ చేస్తారన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. అలాగే స్థానిక ఎన్నికల్లో పార్టీ విఫలమైన చోట బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం జగన్ మంత్రులకు ఈ మేరకు హెచ్చరించినట్లు చెబుతున్నారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోను ఇలాంటి అనుభవం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇవీ చదవండి