ETV Bharat / city

'ప్రజల కోసం పోరాడుతున్నారనే కేసులు పెట్టారు'

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని.....తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. బెయిల్‌పై ఇటీవల బయటకు వచ్చిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను పరామర్శించిన ఆయన... వారిపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. జగన్ నియంతృత్వ పాలనపై పోరాటం చేద్దామంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు.

chandrababu-
chandrababu-
author img

By

Published : Sep 2, 2020, 8:25 PM IST

Updated : Sep 3, 2020, 1:59 AM IST

విజయవాడ కరెన్సీనగర్‌లో ఉంటున్న మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల ఇంటికి వెళ్లి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వారిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రజా జీవితంలో పోరాటానికి దిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. అచ్చెన్న చాలా ధైర్యవంతుడన్న చంద్రబాబు... అతన్ని ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఏం చేయలేవంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను, పార్టీ పూర్తి అండగా ఉంటుందన్న చంద్రబాబు.. మున్ముందు ఇదే ధైర్యాన్ని కనబరచాలని అచ్చెన్నకు సూచించారు. అక్రమ కేసులకు భయపడి తలొగ్గే సమస్యే లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు చంద్రబాబుకు తేల్చిచెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మున్ముందు పోరాటాన్ని మరింత పెంచుతాని స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు

నిలదీస్తూనే ఉంటాను: అచ్చెన్నాయుడు

ప్రభుత్వం త‌ప్పులు నిల‌దీయ‌డమే తాను చేసిన త‌ప్పయితే ,ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టినా నిల‌దీస్తూనే ఉంటానని అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. స‌ర్కారు అవినీతిని ప్రశ్నించ‌డ‌మే నేరమైతే ఎన్ని అక్రమ‌కేసులు పెట్టినా తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. నిజాయితీయే తన ధైర్యం, స‌త్యం ఆయుధమన్న అచ్చెన్నా.., ప్రజాక్షేమ‌మే తన ల‌క్ష్యమన్నారు.

కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లిన చంద్రబాబు.... ఆయనతో సమావేశం అనంతరం ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు సూచించారు. హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించారనే విషయం చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారన్నారు. అక్రమ కేసు నుంచి ఆయన సచ్ఛీలుడిగా బయటకు వస్తారని ఆకాంక్షించారు. కొల్లు రవీంద్ర మామ నడికుదిటి నరసింహారావుకి చంద్రబాబు ధైర్యం చెప్పి కుటుంబసభ్యులకు అండగా ఉండాలని సూచించారు.

కొల్లు రవీంద్రను ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. రాజకీయ కక్షల కారణంగానే రవీంద్రను ఈ కేసులో ఇరికించారని.... ఆయన ఏ తప్పూ చేయలేదన్నారు. న్యాయస్థానం మీద నమ్మకం ఉందని.... త్వరలోనే నిర్దోషిగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... 'రైతులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.7171 కోట్లు జమ'

Last Updated : Sep 3, 2020, 1:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.