సామాజిక న్యాయం కోరుతూ.. బడుగుబలహీన వర్గాల హక్కుల పరిరక్షణ, అభ్యన్నతికి తన జీవితాంతం కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. హరిత విప్లవాన్ని సాకారం చేయడంలో కీలత పాత్ర పోషించిన గొప్ప నాయకుడు ఆయన అని చంద్రబాబు కొనియాడారు.
గాయక శిఖామణి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జయంతిపై...
గాయక శిఖామణి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. "తెలుగువారందరికీ గర్వకారణమైన కళాకారుడు.. ఆ గాయక శిఖామణి గౌరవార్థం బాలమురళీకృష్ణ జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర వేడుకగా జరపాలని గతంలో తెదేపా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు గుంటూరులోని ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాలకు బాలమురళీకృష్ణ పేరు పెట్టాం. ప్రతి ఏటా ఆయన జయంతి రోజున నిష్ణాతులైన సంగీత కళాకారులకు రూ.లక్ష అవార్డు ప్రకటించి... సంగీతం నేర్చుకునే ప్రతిభగల విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశాం. బాలమురళీకృష్ణ రచించిన 300 సంకీర్తనలను రికార్డు చేయించేలా ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలేవీ జరగకపోవడం బాధగా ఉంది." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
దలైలామా ఆయురారోగ్యాలతో ఉండాలి..
బౌద్ధ మత గురువు దలైలామాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 86వ పుట్టిన రోజు జరుపుకొంటున్న దలైలామా ఆయురారోగ్యాలతో ఉండి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:
water disputes: 'ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో.. భద్రత ఏర్పాటు చేయండి'